పాక్ ప్రధానిపై కైఫ్ ట్విట్ 


టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌  తొలిసారి రాజకీయాలని టచ్ చేశారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై మండిపడ్డాడు. ఐరాస సర్వసభ్య ప్రతినిధుల సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఒక గొప్ప క్రికెట్‌ర్‌గా ఇమ్రాన్‌ మీద చాలా గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడాయన ఉగ్రవాదానికి రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఈ మేరకు ఓ ఆంగ్లమీడియాలో ఇమ్రాన్‌ ఖాన్‌ మీద వచ్చిన కథనాన్ని కైఫ్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఉగ్రవాదాన్ని వెంటబెట్టుకుని ఇప్పటికే మీ దేశమైన పాకిస్థాన్‌ ఎంతో చేసింది. ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తోంది. ఐరాసలో మీరు చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనం. ఒక గొప్ప క్రికెటర్‌గా పేరందుకున్న మీరు.. ఇప్పుడు ప్రధాని పదవి చేపట్టి ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మగా మారారు’ అని రాసుకొచ్చారు. ఇప్పుడు కైఫ్ ట్విట్ వైరల్ అవుతోంది.