అప్పుల్లో ఇమ్రాన్ ఖాన్ రికార్డ్


క్రికెటర్ గా రికార్డులు నెలకొల్పిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు పాక్ ప్రధానిగా సరికొత్త రికార్డులని సృష్టిస్తున్నాడు. భారత్ విషయంలో అత్యూత్సాహంతో పాక్ ప్రధాని సెల్ఫ్ గోల్స్ చేసుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రక్కనపెడితే.. అప్పుల్లోనూ ఇమ్రాన్ రికార్డ్ సృష్టించాడు. దేశంలోని అప్పులకు సంబంధించి స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ ఓ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. దేశం అప్పుల కుప్పగా తయారైనట్లు ఈ నివేదిక తేల్చింది.

ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దాదాపు రూ.7లక్షల కోట్లు (పాకిస్థాన్‌ కరెన్సీ) రుణంగా తీసుకుంది. 2018 ఆగస్టు నుంచి 2019 ఆగస్టు వరకు విదేశీ వనరుల ద్వారా రూ.2,80,400 కోట్లు అప్పుగా పొందింది. మరో రూ.4,70,500 కోట్లు స్వదేశీ వనరుల ద్వారా తీసుకుంది. ఇంతకుముందు పాకిస్థాన్‌లోని ఏ ప్రభుత్వమూ ఏడాదిలోపు అంత రుణం తీసుకున్నది లేదు.