కర్నూలులో కర్రల సమరం : 50 మందికి గాయాలు 


సాంప్రదాయమే కానీ ప్రాణాపాయం. దేశంలో ఇలాంటి ఉత్సవాలు, జాతరలు, ఫైట్లు, పోటీలు ఉన్నాయి.దసరా పండగని పురస్కరించుకొని
కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం (బన్నీ ఉత్సవం) కూడా ఇలాంటిదే. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది తమ ఇలవేల్పును దక్కించుకునేందుకు అయిదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 50మందికి పైగా గాయాలయ్యాయి. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రస్తుతం వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ యేడాది కర్రల సమరంలో రక్తపాతం తగ్గించేందుకు పోలీసులు కృషి చేశారు. ముందుగానే ఈ ఉత్సవంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్‌ వాహనంతో నిఘాను పటిష్టం చేశారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం నిర్వహించారు. అయినా.. హింసని అరికట్టలేకపోయారు. చాలామంది మధ్యం తాగి ఉత్సవానికి రావడంతో గొడవ పెద్దదైంది.