చిరు-కొరటాల సినిమా కథ లీక్
ఈ డిజిటల్ యుగంలో ఎక్కడ నుంచి చిన్న కాపీ కొట్టినా ఈజీగా కనిపిట్టేస్తున్నారు. ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్, నేపథ్య సంగీతం.. ఇలా ప్రతి అంశాన్ని ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారంటూ ప్రూఫ్ తో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలోనే దర్శక-నిర్మాతలు ముందుగానే కాపీ మరక అంటకుంట జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి 152 సినిమాకి ఈ రకమైన ముందు జాగ్రత్త తీసుకొన్నట్టు సమాచారమ్. చిరు కోసం కొరటాల తనదైన మార్క్ ఓ సోషల్ మెసేజ్ ఓరియెంటెండ్ కథని ఎంపిక చేసుకొన్నారట. పూర్తి స్క్రిప్ట్ ని కూడా రెడీ చేశాడు. ఐతే, అది మోహన్ లాల్ ‘లూసిఫర్’ సినిమాని పోలీవుంటుందట.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ ‘లూసిఫర్’ రిమేక్ రైట్స్ ని కొన్నారట. ఆ తర్వాత కాపీ రైట్స్ గోల ఉండకూడదని ముందు జాగ్రత్తగా ఆ సినిమా రిమేక్ రైట్స్ ని తీసుకొన్నారట. లూసిఫర్ మలయాళంలో బాగానే ఆడింది. కానీ, తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇప్పుడీ ఈ సినిమా లైన్ తో మెగాస్టార్ 152 తెరకెక్కుతోంది.. అంటే కథ దాదాపు లీకైనట్టే. ఐతే, కొరటాల మార్క్ టేకింగ్, సోషల్ మెసేజ్ తో సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తానడంలో అతిశయోకి లేదు. ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. టాలీవుడ్ లో అపజయం ఎరగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మిర్చి నుంచి భరత్ అను నేను వరకు ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.
ఇక ఈ సినిమా మంగళవారం దసరా కానుకగా ప్రారంభోత్సవం జరుపుకొంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిరు, రామ్ చరణ్, కొరటాల శివతోపాటు అంజనా దేవి, సురేఖ, సుస్మిత తదితరులు పూజకు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సురేఖ క్లాప్ కొట్టారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.