కల్యాణ్ రామ్ మంచోడే కానీ.. !

నందమూరి కల్యాణ్ రామ్ తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. మెహ్రీన్ కథానాయిక. సతీష్ వేగ్నేశ దర్శకుడు. ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఫ్యామిలీ ఎలిమిమెంట్స్ ని చక్కగా చూపిస్తూనే.. యాక్షన్ ని హైలైట్ చేస్తూ టీజర్ ని కట్ చేయడం ఆకట్టుకుంటోంది. ‘అందరూ మంచోడు.. మంచోడు అంటున్నారు.. మరి నువ్వేంట్రా ఇలా కొడుతున్నావ్’ అని విలన్ అడగ్గా.. ‘రాముడు కూడా మంచోడే.. కానీ రావణుడిని వేసేయలె’ అంటూ.. కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది.

టీజర్ లో కల్యాణ్ రామ్ ని శివ, ఆచార్య, బాలు, సూర్య, రిషి అంటూ ఐదు పేర్లతో పిలవడం చూస్టుంటే కథలో మంచి ట్విస్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది. లేక ఆయా పేర్లకి తగ్గట్టుగా హీరో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తాడా ? అన్నది చూడాలి. మొత్తానికి.. కల్యాణ్ రామ్ మంచోడే కానీ.. అంతకుమించి ఇంకా ఏదో ఉందని టీజర్ ని చూస్తే అర్థమవుతోంది. అది తెలియాలంటే.. సంక్రాంతి వరకు ఆగాల్సిందే.