నాని అఖిల్’ని అస్సలు కేర్ చేయడం లేదు

నాచురల్ స్టార్ నానిపై అక్కినేని అభిమానులు గుర్రుగా ఉన్నట్టు కనబడుతోంది. నాని తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (ఎంసిఎ) డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత రోజు (డిసెంబర్ 22)న అఖిల్ ‘హలో’ చెప్పబోతున్నాడు. హలో హిట్టవ్వడం అఖిల్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో.. కాస్త ముందుకు, వెనక్కి వెళ్లాలని రిక్వెస్ట్ చేసిన నాని అస్సలు వినడం లేదట.

ఇదీగాక, అస్సలు అఖిల్ తనకి ఏమాత్రం పోటీ కాదనట్టు నాని మాట్లాడుతున్నారు. అఖిల్’తో యుద్ధం చేయబోతున్నారా ? అని మీడియా మిత్రులు అడిగితే.. అబ్బే నా యుద్ధం సల్మాన్ ఖాన్’తో అనేశాడు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రం కూడా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. “యుద్ధం నాకు అఖిల్‌కి మధ్య కాదు.. సల్మాన్‌ ఖాన్‌తో. ఈ క్రిస్మస్‌కు ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’.. ‘టైగర్‌’కు ‘హలో’ చెబుతాడు. తెలుగు సినిమాపవర్‌’ అంటూ ట్వీట్‌ చేశారు నాని. దీంతో.. నాని అఖిల్ ని అస్సలు లెక్కడం చేయలేదని అక్కినేని అభిమానులు ఫీలవుతున్నారు.

నేరుగా థియేటర్స్ లోనే నానిని పెద్ద దెబ్బకొడతామని, ఇకపై చిన్న హీరోని తక్కువ అంచనా వేయకుడా బుద్ది చెబుతామని అక్కినేని అభిమానులు డిసైడ్ అయినట్టు కనబడుతోంది. ఇది జరగాలంటే.. హలో బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందే. మరోవైపు, నాని అభిమానులు మాత్రం.. సల్మాన్ ని ఓవర్సీస్ లో ఎదుర్కొనేందుకు నాని ఆ కామెంట్ చేసి ఉంటాడని వెనకేసుకొస్తున్నారు.