శాసనసభ సమావేశాలకు ప్రైవేటు మీడియా బ్యాన్ !
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ప్రయివేటు మీడియాని బ్యాన్ చేస్తూ తీసుకొన్న నిర్ణయం వివాదాస్పదం అయింది. శాసనసభ సమావేశాల కవరేజ్‌నుంచి ప్రైవేటు మీడియాను నిషేధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. శాసనసభ సమావేశాల కవరేజ్‌కు దూరదర్శన్‌కు మాత్రమే అనుమతి మంజూరు చేశారు. ప్రైవేటు ఎలెక్ట్రానిక్ మీడియాను నిషేధించారు. దినపత్రికల విలేకరులను సమావేశాలకు అనుమతించారు.
దీనిపై ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆందోళనకి దిగారు. బెంగళూరులో ధర్నా నిర్వహించారు. ఇప్పుడీ వ్యవహారంపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా గమనిస్తున్నాయి. భవిష్యత్ లో ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయివేటు మీడియాను బహిష్కరించే అవకాశాలు లేకపోలేదని సమాచారమ్. మరీ.. ప్రయివేటు మీడియా ఆందోళన నేపథ్యంలో కర్ణాటక స్పీకర్ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకుంటారేమో చూడాలి.