ఆశ్రమంలో చేరిన పవన్


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆశ్రమాల బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా పవన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దాంతో బయటి కార్యక్రమాలకి వెళ్లడం లేదు. కేరళలో ప్రకృతిచికిత్స తీసుకుంటూ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
అలాంటి పవన్ ఇప్పుడు సడెన్ గా హరిద్వార్‌లో దర్శనమిచ్చారు.మాత్రి సదన్ ఆశ్రమాన్ని గురువారం పవన్ సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం అసువులు బాసిన ప్రొ. జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

వాటర్ మాన్ అఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పవన్ తో భేటీ అయ్యారు. జీడీ అగర్వాల్ ప్రధమ వర్థంతికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇందులో భాగంగానే పవన్ అక్కడికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే చార్‌దమ్ యాత్ర చేయబోతున్నట్టు సమాచారమ్.