తమన్నా ముద్దు కోరుకుంటోంది.. !

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. బాలీవుడ్ లోనూ మెరిసింది. తన 12యేళ్ల సినీ కెరీర్ లో స్టార్ హీరోలతో ఆడిపాడింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంది. బాహుబలి, సైరా లాంటి ప్యాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. గ్లామర్ కి కెరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అయినా.. ఇప్పటి వరకు మిల్కీ బ్యూటీ పెదాలు ఎంగిలి కాలేదట. ఇంతవరకు ఆమెని ఎవరు ముద్దుపెట్టుకోలేదట.

ఇది నిజం. ఈ విషయాన్ని తమ్మూనే చెప్పింది. ఎందుకలా ? అంటే తనని ముద్దు ఇవ్వమని ఎవరు అడగలేదు. నాకు ఆవకాశం రాలేదు. తాను ముద్దు కోసం ఎదురు చూస్తున్నానని అంటోంది. మొత్తానికి.. ముద్దులు పెట్టేందుకు, పెట్టించుకొనేందుకు తమ్మూ రెడీ. మరీ.. తమన్నాతో ముద్దు పెట్టించే దర్శకుడు ఎవరు అవుతారు. ఆ లక్కీ హీరో ఎవరు అవుతారన్నది చూడాలి. ఐతే, తమన్నా ఓపెన్ ఆఫర్ ని మాత్రం వాడుకొని తీరాల్సిందే అన్నది ప్రేక్షకుల మాట.