రివ్యూ : ఆర్డీఎక్స్ లవ్


చిత్రం : ఆర్డీఎక్స్ లవ్ (2019)

నటీనటులు : పాయల్ రాజ్ పుత్, తేజూస్ కంచర్ల, ఆదిత్య మీనన్, ముమైత్ ఖాన్, విద్యులేక రామన్ తదితరులు

సంగీతం : రథన్

దర్శకత్వం : శంకర్ భాను

నిర్మాత‌లు : సి. కళ్యాణ్

రిలీజ్ డేట్ : 11 అక్టోబర్, 2019.

‘ఆర్డీఎక్స్100’లో బోల్డ్ నటనతో ఆకట్టుకొంది పాయల్ రాజ్ పుత్. ఆమె రెండో సినిమా ‘ఆర్టీఎక్స్ లవ్’ విషయంలోనూ పద్దతి మార్చుకోలేదు. మరింతగా రెచ్చిపోయినట్టు టీజర్, ట్రైలర్ తో అర్థమైంది. బోల్డ్ నటన మాత్రమే కాదు. మంచి కథ కూడా ఉంటుందని చిత్రబృందం చెప్పింది. ఐతే, పాయల్ క్రేజ్ దృష్ట్యా ఆర్డీఎక్స్ లవ్ యూత్ లోకి బాగానే వెళ్లింది. మరీ ఈరోజు థియేటర్స్ వచ్చిన ఆర్డీ ఎక్స్ లవ్ ఎలా ఉంది. ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

అలివేలు (పాయల్ రాజ్ పుత్) సోషల్ యాక్టవిస్ట్. సేఫ్ సెక్స్, మరియు కుటుంబ నియంత్రన వంటి ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఉంటుంది. దీని వెనక అలివేలు లక్ష్యం సీఎం అపాయింట్ మెంట్ సాధించడం. ఈ క్రమంలో తేజూస్ కంచర్ల ప్రేమను వాడుకోవాలని భావిస్తుంది. అసలు అలివేలు ఎవరు ? ఆమె ఎందుకు సీఎంని కలవాలనుకుంటుంది ? చివరికి ఆమె లక్ష్యం నెరవేరిందా ? అన్నది ఆర్డీ ఎక్స్ లవ్ కథ.

ప్లస్ పాయింట్స్ :

* పాయల్ నటన

* సంగీతం

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* బోల్డ్ సీన్స్, డైలాగ్స్

* ఫస్టాఫ్

* సాగదీత

ఎలా ఉందంటే ?

‘ఆర్ఎక్స్100’ బోల్డ్ సినిమాయే. కానీ కథ-కథనం గ్రిప్పింగా సాగుతాయి. అనూహ్య మలుపులు, ట్విస్టులు ఉంటాయ్. బోల్డ్ సీన్స్ సైతం కథని మరింత బలంగా తీర్చిద్దినట్టు అనిపిస్తాయ్. కానీ ఆర్డీఎక్స్ లవ్ లో కేవలం పాయల్ బోల్డ్ ఇమేజ్ ని వాడుకోవాడానికి ఆ సీన్స్ ని రాసుకొన్నట్టు అనిపించింది. ఐతే, ఆ సీన్స్ లో పాయల్ అదరగొట్టేసింది. మరోసారి ఓ యువకుడి ప్రేమని వాడుకొన్న అమ్మాయిగా కనిపించింది. యూత్ కి మరోసారి విందు బోజనం పెట్టేసింది. ఫస్టాఫ్ అంతా బోల్డ్ సీన్స్, బోల్డ్ డైలాగ్స్ తో సినిమా సాగింది. ఇక సెకాంఢాఫ్ లో సీరియస్ కథలోకి తీసుకెళ్లినా.. కథనం గ్రిప్పింగా సాగలేదు. సేఫ్ సెక్స్, కుటుంబ నియంత్ర ఏపీసోడ్ కథకి అసలు అతకలేదు.

ఎవరెలా చేశారంటే ?

పాయల్ రాజ్ పుత్ తనకి అలవాటే అయిన బోల్డ్ నటనతో ఆకట్టుకొంది. తొలిసారి లేడీ ఓరియెటెండ్ సినిమాలో అంతా తానై నటించింది. పాయల్ నటనకి వంకపెట్టలేం. కాకపోతే.. మంచి కథని ఎంచుకొంటే బాగుండేది. హీరోగా చేసిన తేజూస్ కంచర్ల పర్వాలేదనిపించాడు. నటుడుగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక ప్రధాన విలన్ గా నటించిన ఆదిత్య మీనన్ బాగా నటించారు.మిగితానటినటీలు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

చిన్ని సినిమా పెద్ద విజయం సాధించడంలో టెక్నికల్ అంశాలు కీలక పాత్రని పోషిస్తాయి. ఇక ఈ సినిమాలో సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకొంది. సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించారు. సీనియర్ నిర్మాత సి కల్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : బోల్డ్ సీన్స్ ఉన్నంత మాత్రనా సినిమా సంచలన విజయం సాధించదు. దానికి తగ్గట్టు గ్రిప్పింగ్  కథ-కథనాలు ఉండాలి. ఆర్డీఎక్స్ లవ్ లో అదే మిస్సయింది. ఫలితంగా ఆర్డీఎక్స్ సరిగ్గా పేలలేదు.

రేటింగ్ : 2/5

నోట్ : ఈ సమీక్ష సమీక్షకుడి వ్యతిగత అభిప్రాయం మాత్రమే.