వేతనాలు పెంచాలని కోహ్లీ డిమాండ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెటర్ల వేతనాలను పెంచాలని డిమాండ్ చేయబోతున్నాడు. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో విరాట్ తన వాదనను సభ్యలకు చెప్పబోతున్నాడు. క్రికెటర్ల కాంట్రాక్టులు సెప్టెంబరు 30తో ముగిశాయి. దీంతో వేతనాలపై కీలక చర్చలు జరుగు తున్నాయి. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లకు మూడు వేతన శ్రేణులున్నాయి. ఎ, బి, సి శ్రేణులుగా ఆటగాళ్లని విభజించి వేతనాలు ఇస్తున్నారు.
వేతనాలపై బోర్డుని డిమాండ్ చేయబోయే ముందు కెప్టెన్ విరాట్, మాజీ కెప్టెన్ ధోనీ, కోచ్ రవి శాస్త్రీలు సమావేశం కానున్నారు. ఆ తర్వాత టీం-సభ్యులతోనూ చర్చించనునారు. ఆ తర్వాత బోర్డు ముందు వేతనాల పెంపు డిమాండ్ ని పెట్టనున్నారు. గతంలో భారత జట్టు మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే క్రికెటర్ల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశాడు.