19న తెలంగాణ బంద్


సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కార్యాచరణ ప్రకటించింది.ఇందులో భాగంగా ఈనెల 19న తెలంగాణలో బంద్ పాటించాలని పిలుపునిచ్చింది.

ఆర్టీసీ కార్మికుల కార్యచరణ :

* ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు

* 14న అన్ని డిపోల ఎదుట బైఠాయింపు, బహిరంగసభలు

* 15న రాస్తారోకోలు, మానవహారాలు

* 16న ఐకాసకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీలు

* 17న ధూంధాం కార్యక్రమాలు

* 18న ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించాలని ఐకాస నిర్ణయించింది.

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లని తీర్చేందుకు అంత సంసిద్ధంగా ఏమీ కనిపించడం లేదు. రెండు ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారమ్. సమ్మే చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనలో ఒకటిగా కనిపిస్తోంది. ఈ నెల 15న ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆ తర్వాతే ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసేలా కనిపిస్తోంది. ఇక ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఈ నెల 19వ దసరా సెలవులని పొడగించింది ప్రభుత్వం.