బుజ్జిగాడు చాలా స్పీడు

బుజ్జిగాడు అంటే ఇక్కడ ప్రభాస్ కాదు. రాజ్ తరుణ్. కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. మాళవిక నాయర్ కథానాయిక. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తయింది. శనివారం రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. “ఇదో క్యూట్ లవ్‌స్టోరీ. రాజ్ తరుణ్ కి బాగా సూట్ అవుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సెన్సిటివ్ లవ్‌స్టోరీని రూపొందించిన కొండా విజయ్‌ కుమార్‌ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. డైలాగ్స్ చాలా చక్కగా ఉంటాయి. సీనియర్ నటి వాణీవిశ్వనాథ్ కీలక పాత్ర నటిస్తున్నారు” అని తెలిపారు.