అందుకే.. తమన్నా గదిలోకి రాలేదట !


మిల్కీ బ్యూటీ తమన్నాకి గది పిలుపులు వచ్చాయ్. ఆమె కూడా సంతోషంగా ఒప్పేసుకొంది.ఓపెనింగ్ కి కూడా వచ్చేసింది. దీంతో ఈ సారి గదికి ఫుల్ క్రేజ్ వచ్చినట్టే. ఓంకార్ పంట పండినట్టే అనుకొన్నారంతా. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది, రాజుగారి గది 2 మంచి విజయాలని అందుకొన్నాయి. రాజుగారి గది 3 కోసం తమన్నాని తీసుకొన్నారు. ఆమె ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కానీ అంతలోనే తమన్నా హ్యాండిచ్చింది. రాజుగారి మూడో గది నుంచి తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో యంగ్ హీరోయిన్ అవికా గోర్ ని తీసుకొన్నారు.

ఈ నెల 18న రాజుగారి గది3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో అశ్విన్ తమన్నా గది నుంచి తప్పుకోవడంపై స్పందించారు. ‘ఈ సినిమాలో మొదట తమన్నానే తీసుకున్నాం. కాకపోతే ఆమెకి డేట్స్‌ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమెకు డేట్స్‌ కుదరక రెండు షెడ్యూల్స్‌ కూడా వాయిదా వేశాం. అందుకే ఆమె స్థానంలో అవికాగోర్‌ను తీసుకున్నాం. అవికా నటన ఈ సినిమాలో చాలా బాగుంటుంది’ అన్నారు అశ్విన్.

‘రాజుగారి గది’ చిత్రంతో పోలిస్తే ‘రాజుగారి గది2’ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిందని ప్రేక్షకులు అన్నారు. కానీ ‘రాజుగారి గది 3’ సినిమాతో బాగా ఎంటర్‌టైన్‌ చేయబోతున్నామని చిత్రబృందం చెబుతోంది. ఇందులో అశ్విన్ మాస్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడట. ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.