పిక్ ఆఫ్ ది డే : బాలయ్యతో చిరు ముచ్చట్లు

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై నందమూరి బాలయ్య నోరు తెరవలేదు. కనీసం చిరుకి ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. రిలీజ్ తర్వాత కంగ్రాఫ్స్ చెప్పలేదు. బాలయ్య-చిరులకి మళ్లీ చెడిందా ? దానికి కారణం ఏంటీ ? అనే మాటలు వినిపించాయ్. కథనాలు కనిపించాయ్. వీటికన్నింటికి ఓ సింగిల్ పిక్ చెక్ పెట్టింది.

ప్రముఖ దర్శకుడు, దివంగత కోడిరామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లికకు సీహెచ్‌ మహేశ్‌తో వివాహం జరగనుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుకగా హైదరాబాద్‌లో జరిగింది. పార్క్‌ హయత్‌లో నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్‌ సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చిరంజీవి-బాలకృష్ణ కలిసి కూర్చొని మాట్లాడుకొంటున్న చిత్రం విపరీతంగా వైరల్‌ అవుతోంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’-‘సైరా: నరసింహారెడ్డి’ కలిసి మాట్లాడుకుంటున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.