కేకే మాటల వెనక కేసీఆర్


ఆర్టీసీ కార్మికులతో మరోసారి చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఘంటాపథంగా చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, తప్పేలా లేదు. కార్మికుల సమ్మె రోజు రోజుకి ఉదృతం అవుతోంది. బలిదానాల దాక వెళ్లింది. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ప్రాణ త్యాగం చేశారు. చూస్తుంటే.. మరో తెలంగాణ ఉద్యమంలా మారేలా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దిగిరాక తప్పేలా లేదు. కానీ, అప్పుడు అంత గట్టిగా మాట్లాడిన సీఎం కేసీఆర్ మళ్లీ కార్మికులని చర్చకు పిలిచేదెలా ? అందుకే సీనియర్ కేశవరావుని రంగంలోకి దించినట్టు కనిపిస్తోంది.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన కేకే ఆర్టీసీ సమ్మెపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. అవకాశం ఇస్తే.. కార్మికులకి, ప్రభుత్వానికి మధ్యవర్థిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాని కేకే ప్రకటించారు. ఐతే, కేకే ను రంగంలోకి దింపింది సీఎం కేసీఆర్ నే అంటున్నారు. అప్పుడు చర్చలు జరిపేదే లేదని ఇప్పుడు చర్చలకి పిలిచే మొహం లేకనే ఈ ఎత్తుగడ వేశారని చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. రేపు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం తిరిగి చర్చలు ప్రారంభించబోతున్నట్టు సమాచారమ్. కార్మికుల డిమాండ్లని దాదాపు ఓకే చేయనుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఆర్టీసీ కార్మికులు ఇన్నిరోజుల కష్టం ఫలించినట్టే.