‘డిస్కోరాజా’పై నమ్మకం పెరిగింది !


‘రాజా ది గ్రేట్’ తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ఆ తర్వాత మళ్లీ ప్లాపుల్లోకి వెళ్లాడు. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్భర్ ఆంథోని సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆయన తాజా చిత్రం డిస్కోరాజా. వి. ఐ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమాపై ఇప్పుడు నమ్మకం పెరిగింది. డిస్కో రాజాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యతని నిర్మాత సురేష్ బాబు తీసుకొన్నారు. సురేశ్ ది మంచి టేస్టే. కథ బాగుంటే చిన్నా, పెద్ద సినిమాలని టేకప్ చేస్తున్నాడు. ఇప్పుడు డిస్కో రాజాని సురేశ్ తీసుకోవడంతో.. ఆ సినిమాపై అంచనాలు పెరిగాయ్.

సాధారణంగా రవితేజ లాంటి పెద్ద హీరోల సినిమాలు అమ్ముకుంటారు. కానీ డిస్కోరాజా నిర్మాత రామ్ తాళ్లూరి మాత్రం తన సినిమాను సురేష్ కు డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వడం విశేషం. అది కూడా ఎటువంటి అడ్వాన్స్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘డిస్కో రాజా’తో పాటు ‘శ్రీ విష్ణు తిప్పరా మీసం’, తరుణ్ భాస్కర్.. ‘మీకు మాత్రమే చెప్తా’, పీపుల్స్ మీడియా ‘వెంకీ మామ’, సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్  డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. ఈ నాలుగు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం విశేషం.