బాలయ్య105 టైటిల్ ‘రూలర్’ !


కెయస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్సయింది. ‘రూలర్’ పేరు పెట్టారు. బాలయ్య కోసం ఎప్పటి నుంచో వినిపిస్తున్న టైటిల్ ఇది. ఇన్నాళ్లుకు ఆ టైటిల్ ని వాడుకొంటున్నారు. జై సింహా తర్వాత కెయస్ రవికుమార్ బాలయ్య కలయికలో తెరకెక్కుతోన్న చిత్రమిది. 

ఈ సినిమా కోసం ‘క్రాంతి’ , ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ అనే టైటిల్స్ వినిపించాయ్. గతంలో బాలయ్య సినిమాల కోసం వినిపించిన రూలర్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. పోలీస్ ఆఫీస‌ర్‌గా ఉన్న బాల‌య్య గ్యాంగ్ స్ట‌ర్‌గా ఎలా మారాడ‌నేదే ‘రూలర్’ కథని చెబుతున్నారు. ఈ సినిమాకోసం బాలయ్య స్టయిలీష్ లుక్ లోకి మారిపోయాడు. బాలయ్యకి జంటగా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వాస్తవానికి రూలర్ టైటిల్ ని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈలోపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని కొనేసిన జెమినీ టీవీ టైటిల్ ని లీక్ చేసింది. బాలయ్య-సోనాల్ చౌహాన్ జంటగా నటిస్తున్న రూలర్ సినిమా శాటిలైట్ రైట్స్ ని కొనేసినట్టు జెమినీ టీవీ అధికార ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశారు. డిసెంబర్ 20న రూలర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.