గ్రేట్ : కేటీఆర్’కు అమెరికా ఆహ్వానం
నరేంద్ర మోడీ, ఇవంకా హైదరాబాద్ టూర్’లో మంత్రి కేటీఆర్ హైలైట్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ మంత్రి కేటీఆర్’కు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం ఆకట్టుకొంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవం సమయంలో మోడీ కేటీఆర్’ని పిలిచి మరీ.. తన ప్రక్కన నిలబెట్టుకొన్నారు. రైలు ప్రయాణంలోనూ మోడీ ప్రక్కనే కేటీఆర్ కూర్చొన్నారు. మొత్తానికి కేటీఆర్ వ్యక్తిత్వం ప్రధానికి నచ్చిందన్న విషయం అర్థమైంది. మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని కాదు.. హైదరాబాద్ టూర్ కి విచ్చేసిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముద్దుల కూతురు ఇవంకా ట్రంప్ ని కూడా పడేశాడు.
జీఈ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగం పట్ల ఇవంకాని ఆకట్టుకొంది. ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యతో ఆమె ఫిదా అయిపోయింది. సదస్సు రెండో రోజు ప్యానెల్ చర్చ ముగిసిన వెంటనే అమెరికా రావలసిందిగా కేటీఆర్ ను ఇవంకా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆమె ఆహ్వానించిన 24 గంటలు తిరగకుండానే వైట్ హౌస్ నుంచి మంత్రి కేటీఆర్’కు ఆహ్వానం అందించింది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ ధృవీకరించింది.
ఈ నేపథ్యంలో.. మంత్రి కేటీఆర్ యుఎస్ టూర్ వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పుకొంటున్నారు. మరీ.. ఈ పర్యటనలో యుఎస్ నుంచి హైదరాబాద్’కు పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కేటీఆర్ సక్సెస్ అవుతారో చూడాలి.