కొత్త ‘బజాజ్ చేతక్’ లుక్ చూశారా ?
బజాజ్ చేతక్ స్కూటర్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు బజాజ్ ఏర్పాట్లు చేసింది. ఈ స్కూటర్ విశేషాలను బుధవారం బజాజ్ వెల్లడించింది. జనవరి 2020 నుంచి మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. తొలుత పుణే, తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభించి దేశవ్యాప్తంగా విస్తరించాలని బజాజ్ ప్రణాళిక సిద్ధం చేసింది.
బజాజ్‌కు చెందిన ది అర్బనైట్ బ్రాండ్ కింద వస్తున్న తొలి వాహనం ఇదే కావడం విశేషం. దీని ధర సుమారు రూ.1.5లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతానికి ఇది బజాజ్ ప్రీబుకింగ్ నెట్‌వర్క్ కింద ఉంటుంది.కొత్త బజాజ్ చేతక్ వాహనంలో ఐపీ 67 రేటింగ్ ఉన్న హైటెక్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు.
దీనిని 5-15 ఏఎంపీస్ ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీనిలో ఇంటెలిజెట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమర్చారు. ఇది బ్యాటరీని నియంత్రిస్తుంది. దీనిలో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉండే అవకాశం ఉంది. స్కూటర్‌లో రీజనరేటీవ్ బ్రేకింగ్ వ్యవస్థను అమర్చారు.