అందులో బండ్లని మించినోడు లేడు
టాలీవుడ్ బడా నిర్మాతగా పేరు తెచ్చుకొన్న నటుడు బండ్ల గణేష్. ఆర్థిక కష్టాల్లో పడి సినిమాలకి దూరమయ్యాడు. మహేష్ తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఐతే, నిర్మాతగానూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు బండ్ల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోనూ సినిమా చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేసినట్టు.. అలసట వచ్చి ఆ ప్రయత్నాలని మానుకొన్నట్టు సమాచారమ్.
సినిమాల విషయం పక్కనపెడితే.. బండ్లపై చాలానే చెక్ బౌన్స్ కేసులు ఉన్నట్టు సమాచారమ్. ఆయన్ని అరెస్ట్ చేయడానికి మహారాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారనే టాక్ నడుస్తుంది. అక్కడ కూడా ఏవో వ్యవహారాలు బండ్ల గణేష్ కి అరెస్ట్ వారెంట్ వచ్చే వరకూ చేశాయని టాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అతడిపై కేసులు తక్కువేమీ లేవు. ఇప్పటివరకు బండ్ల గణేష్ పై ఎనభైకి పైగా చెక్ బౌన్స్ కంప్లైంట్స్ ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల నిర్మాత పివిపితో బండ్ల గొడవ గురించి తెలిసిందే. ప్రస్తుతం బండ్ల అజ్ఝాతంలో ఉన్నారు. ఆయన బయటికొస్తే.. తెలంగాణ, లేదంటే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.