హుజూర్ నగర్’లో నేడు కేసీఆర్ ప్రచారం


ఈ నెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయ్. హుజూర్ నగర్ ఓటర్ ని ఆకట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీ తెరాస బలగాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో కార్యాచరణ సాగుతోంది. నియోజకవర్గంలో కీలకమైన గిరిజనుల, మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు మంత్రి సత్యవతిరాఠోడ్ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక ఈరోజు సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ప్రతికూల పరిస్థితుల మధ్య కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం బహుశా.. ఇదే తొలిసారి కావొచ్చేమో. తెలంగాణ ఉద్యమ సమయంలో, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ప్రజా మద్ధతు పుష్కలంగా ఉంది. ఐతే, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కారణంగా తొలిసారి కేసీఆర్ కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.