కృష్ణవంశీ కొత్త సినిమా.. ఇదే !


హిట్టిచ్చినా, ప్లాపు ఇచ్చినా దర్శకుడు కృష్ణవంశీ సినిమా కోసం ఎదురుచూసే అభిమానవర్గం ఉంది. వారికి గుడ్ న్యూస్. కృష్ణ కొత్త సినిమా ఖరారైంది. గత కొంతకాలంగా కృష్ణవంశీ మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’ను రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడనే ప్రచారం జరిగుతోంది. ఇప్పుడీ ప్రచారం నిజమైంది. ‘నటసామ్రాట్’ తెలుగు రిమేక్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి రంగమార్తాండ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. రెడ్ బల్బ్  మూవీస్, హౌస్ ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నక్షత్రం తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రమిది. ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు వంశీ. ఆయనకి చాన్నాళ్లుగా సరైన హిట్ లేదు. ఈ నేపథ్యంలో వంశీ చేయబోతున్న రంగమార్తాండ సినిమాపై ఆసక్తి నెలకొంది.