భారత్-పాక్ మ్యాచ్ పై గంగూలీ రియాక్షన్ 

మైదానంలో దాయాదులు భారత్-పాక్ తలపడి చాలా యేళ్లవుతోంది. చివరిసారిగా భారత్, పాక్ 2012లో రెండు టీ20లు, 3 వన్డేల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లో తలపడ్డాయి. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత గంగూలీ నేతృత్వంలోనే టీమిండియా 2004లో పాక్ లో చారిత్రక పర్యటనకు వెళ్లింది. 1989 తర్వాత భారత జట్ట అక్కడ పర్యటించడం అదే తొలిసారి. పుల్వామా ఘటన తర్వాత దాయాదుల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్న సౌరవ్ గంగూలీని భారత్, పాక్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై మీడియా ప్రశించగా.. ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ ప్రశ్న మీరు మోదీజీ, పాక్ ప్రధాన మంత్రిని అడగాలి.  దాయాదుల క్రికెట్ సమరాలకు రెండు దేశాల ప్రధానుల అనుమతి తప్పక అవసరమని పేర్కొన్నాడు. ఎందుకంటే అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే కొనసాగుతాయని తెలిపాడు.