సెహ్వాన్ గొప్ప పని


టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చాలా గొప్ప పని చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఆ అమర జవాన్లలో కొందరి పిల్లలు సెహ్వాగ్‌ అంతర్జాతీయ స్కూల్‌లో క్రికెట్‌ శిక్షణ తీసుకొంటున్నారు. ఈ విషయాన్ని సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు. పిల్లలు సాధన చేస్తున్న ఫోటోలని షేర్ చేశారు. 

“నా స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నా. ఈ చిన్నారులు భారత అమర వీరుల బిడ్డలు. బ్యాట్స్‌మెన్‌ చేస్తున్న వ్యక్తి అర్పిత్‌ సింగ్‌ పుల్వామా అమర జవాన్ రామ్‌ వకీల్‌ కుమారుడు, బౌలర్‌ రాహుల్‌ సోరెంగ్‌ పుల్వామా అమర జవాన్ విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు. ఇంతకన్నా ఆనందాన్నిచ్చే పనులు ఉంటాయా” అంటూ రాసుకొచ్చాడు. సెహ్వాగ్ గొప్పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.