చంద్రయాన్ 2 : ఫోటోలు పంపిన ఆర్బిటాల్
ఇస్రో ప్రతిష్టాత్మికంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం ఆఖరి మెట్టుమీద ఫెయిలైన సంగతి తెలిసిందే. విక్రమ్ లాండర్ తో సంబంధాలు తెగిపోయాయ్. అయినా.. ప్రయోగం 95 శాతం సక్సెస్ అయిందని ఇస్రో ప్రకటించింది. ఆర్బిటార్ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది.
తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను ఆర్బిటార్ తీసింది. స్పెక్ట్రోమీటర్‌ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి ఉపరితలంపై నిక్షిప్తమైన మూలకాల స్థాయిని.. అదే విధంగా చంద్రుడి మూల స్థానం, పరిభ్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. తాజాగా ఆర్బిటార్ తీసిన ఫొటోలను ఇస్రో తన ట్విటర్లో అకౌంట్లో షేర్ చేసింది. ఈ ఫోటోలని విశ్లేషించిన ఇస్రోకు చాలా ప్రశ్నలకి సమాధానం దొరకనుంది.