ఆసుపత్రిలో చేరిన అమితాబ్.. కండీషన్ సీరియస్ ?


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. గత మూడ్నాలుగు రోజులుగా ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అమితాబ్ కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హెల్త్ కండీషన్ సీరియస్ గా నే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు, రెగ్యులర్‌ చెక్ లో భాగంగానే అమితాబ్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఐతే, అమితాబ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.