వార్ ఎఫెక్ట్ : ధూమ్3, సుల్తాన్ రికార్డులు బ్రేక్ 

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వార్ హవా కొనసాగుతోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్’ల కాంబోలో తెరకెక్కిన యాక్షన్ చిత్రమిది. వాణీ కపూర్ హీరోయిన్. ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వార్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వార్ కలెక్షన్స్ రూ. 300కోట్ల చేరువయ్యాయ్.

ఈ క్రమంలో ధూమ్3 లైఫ్‌టైమ్‌ వసూళ్లను వార్ అధిగమించింది. ఈ వీకెండ్ లో ‘సుల్తాన్’ కలెక్షన్స్ ని వార్ దాటేయనుందని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. అక్టోబర్ 2న వార్ తో పాటు జోకర్ సినిమా రిలీజైంది. ఇక ప్యాన్ ఇండియా రిలీజైన తెలుగు సినిమా సైరా గట్టిపోటీనే ఇచ్చింది. ఇంతటి పోటీలోనూ వార్ హవా చూపించడం, రికార్డులు బ్రేక్ చేయడం గొప్ప విషమని చెప్పవచ్చు.