ఏపీ మంత్రి చాంబర్ లో సినీనటుడు భానుచందర్…!
ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి చాంబర్ లో సినీనటుడు భానుచందర్ తలుక్కున మెరిశారు. ఆ శాఖా మంత్రి మాణిక్యాలరావును కలిసేందుకు వచ్చిన ఆయనకు అధికారులు, మంత్రి ఘన స్వాగతం పలికారు. తనను భానుచందర్ కలవడానికి రావడంపై మంత్రి మాణిక్యాలరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి సామాజిక ఆలోచనలు ఉన్న వ్యక్తి బాలచందర్ అని మంత్రి కొనియాడారు.
భానుచందర్ కు తనకు ఎనిమిదేళ్లు మాత్రమే తేడా ఉందని, కానీ ఆయన చాలా యంగ్ గా కనిపిస్తున్నాడని మంత్రి మాణిక్యాలరావు భానుచందర్ ను ఆకాశానికెత్తారు. మంత్రిని వ్యక్తిగతంగా కలిసేందుకే ఆయన చాంబర్ కు వచ్చానని భానుచందర్ చెప్పారు. మంత్రి కామన్ మెన్ లా ఉండి మంచి ఆలోచనలున్న వ్యక్తి అంటూ కితాబునిచ్చారు భానుచందర్.