ఆర్టీసీ సమ్మెని ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది ? : హైకోర్ట్
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ మొదలైంది. సమ్మెపై న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగింది. రెండు వారాలుగా ఆందోళనలను జరుగుతుందే ప్రభుత్వం ఏం చేస్తోంది ? కార్మికుల ఆందోళనలను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది ? అని కోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులని, వారు తిరగబడితే ఎవరూ ఆపలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆర్టీసికి ఎండిని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి కొత్త ఎండిని నియమించనంత మాత్రన సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం సమర్థుడైన అధికారి ఇన్‌ఛార్జిగా ఉన్నారని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఇన్‌ఛార్జి సమర్థుడైతే ఆయన్నే ఎండిగా ఎందుకు నియమించలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతుంది. ఫైనల్ తీర్పు రావాల్సి వుంది.