పూజా పోజులు చూశారా ?


‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పూజా హెగ్డే. ఆ తర్వాత ‘ముకుందా’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక తెలుగులో పూజాకి అవకాశాలు కష్టమే అనుకొన్నారు. అదే జరిగింది. ఐతే, అదే సమయంలో పూజాకి బాలీవుడ్ ఆఫర్ దక్కింది. ‘మెహంజదా’రో సినిమాలో హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేసింది. భారీ ఆశలు పెట్టుకొన్న ఈ సినిమా ప్లాప్ అయింది. దాంతో మళ్లీ టాలీవుడ్ లో ఆఫర్ల కోసం గట్టిగా ప్రయత్నాలు చేసింది. గ్లామర్ డోస్ పెంచుతా. రెమ్యూనరేషన్ పట్ల పట్టింపులు లేవని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది.

లక్కీగా పూజాకు డీజే-దువ్వాడ జగన్నాథమ్ లో అవకాశం దక్కింది. ఈ సినిమా తర్వాత పూజాకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో ఓ రౌండ్ వేసేసింది. ప్రస్తుతం రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమా ‘జాన్’లో నటిస్తోంది. మరోవైపు యంగ్ హీరోల పక్కన అవకాశాలని వదులుకోవడం లేదు. గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం అఖిల్ నాల్గో సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ హవా చూపిస్తొంది.

ఆమె నటించిన హౌస్ ఫుల్ 4 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పూజా.. తెగ పోజులు కొడుతోంది. తాజాగా ఆమె కెమెరాకి ఇచ్చిన పోజులు వైరల్ అవుతున్నాయి. నాలుగైదు పోజుల్లో దిగిన ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పూజా.. ‘లైక్ ఎ బాస్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. పూజా.. హాట్ హాటు పోజులని మీరు చూసేయండీ.. !