సీపీఐ నేత వేలు విరగొట్టిన పోలీసులు

తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. ఓ వైపు ఆందోళనలు.. మరోవైపు అరెస్టులు జరుగుతున్నాయి. ఆందోళనకి గిదిన నేతలని పోలీసులు అరెస్ట్ చేసి… జైలుకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఒకట్రెండు హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. సీపీఐ ఎంఎల్ రాష్ట్ర సాహాయక కార్యదర్శి పొట్టు రామురావు వేలు విరిగిపోయింది. ఆందోళన చేస్తున్న అతడిని పోలీసు ఫ్యాన్ లో ఎకించుకొనే క్రమంలో ఆయన చేతి వేలు డోర్ లో ఇరికి.. వేలు కట్ అయింది.

రక్టం కారుతుండగానే పొట్టు రామారావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినోళం. జైలుకి వెళ్లినోళ్లం. ఇప్పుడీ రకంగా పోలీసులు ప్రవర్థించడంపై రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నేటి రాష్ట్రబంద్ విజయవంతం అయిందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. మరోవైపు, తెరాసని సపోర్ట్ చేసే వాళ్లు మాత్రం బంద్ ప్రభావం పెద్దగా లేదు. రోడ్లపై బస్సులు, ఇతర వాహనాలు స్వేచ్చగా తిరుగుతున్నాయని, దానికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.