మళ్లీ మెరిసిన రోహిత్

వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మకి ఎదురులేదు. ఐతే, టెస్టుల్లో ఆయన స్థానం ఎప్పుడు ప్రశ్నార్థకమే. దానికి దక్షిణాఫ్రికా సిరీస్ తో పులిస్టాప్ పడింది. టెస్టుల్లోనూ ఓపెనర్ గా దిగిన రోహిత్ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి.. టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డుని సృష్టించాడు రోహిత్.

ఇవాళ మొదలైన మూడో టెస్టులోనూ రోహిత్ సెంచరీతో మెరిశాడు. 50 పరుగులలోపే మూడు వికెట్లు పడినా.. రోహిత్ చక్కని బ్యాటింగ్ తో ఆకట్టుకొన్నాడు. టీం ఇండియా టీ బ్రేక్‌ సమయానికి 52 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అజింక్యా రహానే (74), రోహిత్‌ శర్మ (108) క్రీజులో ఉన్నారు.

ఇక ఈ సిరీస్ లో రోహిట్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్‌ కొట్టిన తర్వాత ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.