‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ అవసరాల


నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి హీరోగా మారాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, క్రిష్ కలిసి నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ టైటిల్ ని పెట్టారు. శనివారం సినిమా పూజా కార్యక్రమాలని జరుపుకొంది.

వైవిధ్య‌మైన క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్కనుంది. అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ(చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ కథని స్వయంగా అవసరాల అందించారు. కానీ, ఆయన దర్శకత్వ బాధ్యతలని తీసుకోవడం లేదు.