బీజేపీలో టీడీపీ విలీనం.. !?
ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కానీ, ఇందుకు సంబంధించిన ప్రపోజల్ మాత్రం వచ్చింది. అది కూడా బీజేపీ నుంచి కావడం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజాపా కలిసి పోటీ చేశాయి. కేంద్ర ప్రభుత్వంలో తెదేపా భాగస్వామిగా చేరింది. ఆ పార్టీకి రెండు కేంద్ర పదవులు కూడా దక్కాయి. ఐతే, 2019 సార్వత్రిక ఎన్నికలు మరో యేడదికిపైగా ఉండగా భాజాపాతో తెదేపా తెగతెంపులు చేసుకొన్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత బీజేపీ-టీడీపీ పెద్ద వారే నడించింది. కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి భాజాపాని దెబ్బకొట్టాలని, మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా తెదేపా అధినేత చంద్రబాబు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ, అవి ఫలించలేదు. కేంద్రంలో మరోసారి భాజాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరోవైపు, ఏపీలో తెదేపా పూర్తి గా తుడిచిపెట్టుకుపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భాజాపాతో విడిపోయి తప్పు చేశామనే భావనని తెదేపా అధినేత చంద్రబాబు వ్వక్త పరుస్తున్నారు.
దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆసక్తికరంగా స్పందించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని తప్పు చేశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు అంటున్నారనీ, ఐతే ఆయనతో స్నేహం తమకు అవసరం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఉంటే తాను పార్టీ అధిష్టానంతో మాట్లాడతానని జీవీఎల్ అన్నారు. మరీ.. జేవీఎల్ ఆఫర్ ని చంద్రబాబు ఓకే చేస్తారా ? తెదేపాని భాజాపాలో కలిపేందుకు అంగీకరిస్తారా ?? అన్నది చూడాలి.