మరో 8రోజులు ఆర్టీసీ ఆందోళనలు

ఆర్టీసీ జేఏసీ మొదటి విడత కార్యాచరణ ఈ నెల 19తో ముగిసింది. 20 ఆదివారం కావడంతో ఆందోళనలకి బ్రేక్ ఇచ్చారు. ఇక రేపటి (అక్టోబర్ 21) నుంచి మళ్లీ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలని కొనసాగించనున్నారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మరో 8రోజుల పాటు చేసే కార్యక్రమాలని ప్రకటించారు.

* 21న డిపోల ముందు కార్మికుల కుంటుంబ సభ్యుల తో దీక్షలు

* 22న మా పొట్టకొట్టొదని తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లుకు విజ్ఞప్తులు

* 23న తెరాస  పార్టీ  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను కలిసి సమ్మెలో భాగస్వాములు కావలని విజ్ఞప్తి

* 24న మహిళా కండక్టర్లు దీక్షలు

* 25న హైవేలు, ఇతర రహదారులు దిగ్బంధనం

* 26న ఆర్టీసీ  కార్మికుల పిల్లలతో దీక్షలు

* 27న జీతాలు లేకపోవడం వల్ల దీపావళి పండుగ రోజున  నిరసనలు

* 28న హైకోర్టులో సమ్మెపై విచారణ

*30న భారీ సమీకరణతో బహిరంగ సభ,  5 లక్షల మందితో సకల జనుల సమర భేరి చేయాలని నిర్ణయించారు.