ఆర్టీసీ సమ్మెపై సీఎం సమీక్ష.. ఏం తేల్చారంటే ?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఎప్పుడికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడాలని, ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషించాలని, పూర్తి స్థాయిలో బస్సులు నడవాలని, సోమవారం నుంచి ప్రారంభం కానున్న స్కూల్, కాలేజీల విద్యార్థులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడని ఆదేశిస్తున్నారు. ఆదివారం జరిగిన ఆర్టీసీ సమ్మె సమీక్షలోనూ సీఎం కేసీఆర్ వీటి గురించి మాట్లాడారు.
కానీ, ఆర్టీసీ కార్మికులతో చర్చపై నోరు తెరవడం లేదు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చ జరపాలని హైకోర్టు సూచించినా.. ఆదేశించినా సీఎం కేసీఆర్ లో ఎలాంటి చలనం లేదు. దీనికి కారణం ఈ నెల 28న హైకోర్టులో మళ్లీ ఆర్టీసీ అంశం విచారణకు రానుంది. అప్పటిలోగా సీఎం కేసీఆర్ పరిస్థితులని చక్కదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, సోమవారం హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత ఆర్టీసీ కార్మికులతో మళ్లీ చర్చలపై ప్రభుత్వం నుంచి ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.