హూజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ ఉదయం 7గంటలకి ప్రారంభం అయింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 79 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. అక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీ భాస్కరన్ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. 

ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో  ముగ్గురు మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో 2,36,842 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,20,427 మంది మహిళలు, 1,16,415 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇది టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ స్థానం. ఆ స్థానంలో తిరిగి తన భార్యని గెలిపించుకొనేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు ఉత్తమ్ ఇలాకలో గులాభి జెండా ఎగరవేయాలని కసితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది అధికార పార్టీ టీఆర్ఎస్.

రాజకీయ విషయాలు పక్కన పెడితే.. ఆర్టీసీ కార్మికుల సమ్మె హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఏ మేరకు ప్రభావం చూపనుంది అన్నది ఆసక్తిగా మారింది. హుజూర్ నగర్ లో తెరాస గెలవకపోతే.. అది ఖచ్చితంగా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ గా భావించే అవకాశాలు ఉన్నాయి. మరీ..  హుజూర్ నగర్ ఓగర్ ఎలాంటి తీర్పునిస్తాడు ? అన్నది చూడాలి.