తాత్కాళిక డ్రైవర్లకి రోజు రూ.2వేల జీతం !
ఆర్టీసీ కార్మికులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేసీఆర్ సర్కార్ ఆసక్తిని చూపించడం లేదు. కానీ, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవడంపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇవాళ్టీ నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో డ్రైవర్ల కొరత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో తాత్కాళిక డ్రైవర్లకి జీతం పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారమ్. తాత్కాళిక డ్రైవర్ ప్రతిరోజు డ్యూటీకి వస్తే రూ. 2000 ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన తాత్కాళిక డ్రైవర్ నెలకి రూ.60,000 సంపాదించుకోగలడు.
సమ్మెకాలంలో నగరంలో డ్రైవర్ల కొరత రాకుండా ఉండటానికి డ్రైవర్ల జీతం రూ.1500 నుంచి 1750కి పెంచారు. అయితే డ్రైవర్ల కొరత ఏర్పడనున్న నేపథ్యంలో మరో రూ.250 పెంచి రోజు డ్యూటీ చేస్తే రూ.2,000 ఇచ్చేదిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక కండక్టర్లకి రోజువారి జీతాన్ని రూ. 1500 వరకు అందించనుంది. డ్రైవర్స్ సరిపోకపోతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి.. సమ్మె సమయంలో ప్రజలకి ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు మాత్రం ఏమాత్రం ఇష్టం పడటంలేనట్టుగా అనిపిస్తోంది.
తాత్కాళిక డ్రైవర్లకి రోజుకి రూ. 2000 ఇచ్చేందుకు రెడీ అయిన ప్రభుత్వం.. అదే రేంజ్ లో రెగ్యూలర్ డ్రైవర్స్ కి జీతాలు ఇస్తే ఈ సమస్య ఉండదు కదా.. అని అంటున్నారు. మరీ.. ఫైనల్ గా ఆర్టీసీ రెగ్యూలర్ ఉద్యోగుల భవిష్యత్ ని సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నాడని వేచి చూడాలి.