బన్నీ 14కేజీల బరువు తగ్గాడా ?
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న సంగతి తెలిసిందే. దాదాపు యేడాది పాటు ఖాళీగా ఉన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా అనుకొన్నా.. వర్కవుట్ కాలేదు. దాంతో బన్నీకి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో బన్నీ ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించడం. కాస్త బొదుగా మారాడు. ఐతే, అల.. వైకుంఠపురంలో సినిమా కోసం మళ్లీ స్లిమ్ గా మారాడు. ఇందుకో బన్నీ బాగానే కష్టపడ్డాడట.
దాదాపు నాలుగు నెలల పాటు డైట్‌ను ఫాలో అయిన బన్నీ ఏకంగా 14 కేజీల బరువు తగ్గాడట. ఇక హెయిర్‌ను కూడా కట్ చేయకుండా అలానే పెంచుకున్నాడట. దీంతో అల.. వైకుంఠపురంలో సినిమాలో బన్నీ కాస్త పొడవాటి జుట్టుతో స్టయిలీష్ గా కనిపిస్తున్నాడు. ఆర్య2 లుక్ కి కాస్త దగ్గరగా కనిపిస్తున్నాడు. ఫిట్‌నెస్ కోసం ఓ ట్రైనర్‌ను కూడా పెట్టుకున్న బన్నీ.. ఫైనల్ గా స్లిమ్ లుక్ లోకి వచ్చేశాడు. ఇప్పటికే అల.. వైకుంఠపురంలో రెండు షేడ్స్ లోకనిపించిన లుక్ లు బయటికొచ్చాయ్. మొదటి లుక్ లో బన్నీ పల్లెటూరి కుర్రాడిలా,
దసరా బుల్లోడిగా కనిపించాడు. ఇక రెండో లుక్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్టయిలీష్ గా కనిపించారు.
త్రివిక్రమ్-బన్నీ కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం అల.. వైకుంఠపురంలో. పూజా హెగ్డే కథానాయిక. టబు, రావు రమేష్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, జయరామ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా అల.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.