ఆక్సీజన్.. హిట్ అందించలేకపోయింది !

హీరో గోపీచంద్ యాక్షన్’లోకి దిగితే అదిరిపోవాల్సిందే. యాక్షన్’కు ఫర్ ఫెక్ట్’గా సూటయ్యే కటౌట్ కలిగిన హీరో గోపీ. అలాంటి ఈ యాక్షన్ హీరో లౌక్యం, సౌఖ్యం సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అందులో కొద్దివరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఐతే, ఇది ఆయన అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో.. మళ్లీ ‘గౌతమ్ నంద’తో మళ్లీ యాక్షన్’లోకి దిగాడు గోపీ. ఐతే, ఆశించిన స్థాయిలో అభిమానులని అలరించలేదు. గోపీకి హిట్ పడలేదు. ఓ హిట్ కొట్టాలన్న కసి తీరలేదు.

ఈ ప్రయత్నంలోనే గోపీచంద్ నుంచి వచ్చిన మరో యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సీజన్”. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో గోపీచంద్-మెహ్రీన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు స్క్రీన్ ప్లే అందించిన ఎ.ఎం ర‌త్నంను న‌మ్మి ఈ మూవీ చేశాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఆక్సీజన్’ గోపీచంద్ హిట్ దాహం తీర్చిందా ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది.. ?? పబ్లిక్ టాక్ పై ఓ లుక్కేద్దాం..!

సినిమాలో గోపీ చంద్ యాక్షన్ అదిరిపోయింది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో గోపీ అదరగొట్టాడు. ఫస్టాఫ్ లో వచ్చే పాత్రలో అమాయకంగా కనిపించాడు. సరదా సన్నివేశాలు, లవ్ ఏపీసోడ్స్ లో మెప్పించాడు. ఇక, సెకాంఢాఫ్ లో యాక్షన్ లో ఇరగదీశాడు. మొత్తంగా సినిమా గోపీచంద్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. రాశీఖన్నా హాట్ హాట్ అందాలతో కనువిందు చేసింది. ఆమెకి పోటీగా గెస్ట్ రోల్ లో కనిపించిన అను ఇమ్మాన్యూయేల్ ఫర్వాలేదనిపించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన జగపతి బాబు సహజ నటనతో ఆకట్టుకొన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి.. మరీ ఆక్సీజన్.. గోపీచంద్ కి హిట్ అందించినట్టేనా ? అంటే లేదనే చెప్పాలి.

అన్నీ ఉన్నా అదేదో మిస్సయినట్టు. దర్శకుడు గోపీచంద్ సాదాసీదా యాక్షన్ ఎంటర్ టైనర్ చూపించాడు. ఎక్కడా లాజిక్కులని పట్టించుకోలేదు. ఫలితంగా స్క్రీన్ ప్లే గ్రిప్పింగా సాగాలేదు. ఫలితం… ఆక్సీజన్.. యావరేజ్ గా మిగిలిపోయింది. సో.. గోపీ బెస్ట్ ఆఫ్ లక్ నెక్ట్స్ టైమ్.. !!