షకీలాకు ఏకంగా 8మంది ఉన్నారట !
సూపర్ స్టార్స్ మించిన క్రేజ్ షకీల సొంతం. ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోల సినిమాలు పక్కకు జరిగేవి. ఊహ తెలిసినప్పట్నుంచి బోల్డ్ గానే ఉంటున్న షకీల.. బోల్డ్ గానే మాట్లాడుతుంటుంది. షకీల పెళ్లి చేసుకోలేదు. కానీ చాలా మందినే ఇష్టపడిందట. తన పర్సనల్, బోయ్ ఫ్రెండ్స్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షకీల ఆసక్తికర విషయాలు చెప్పింది.
“30ల్లో ఒకర్ని లవ్ చేశాను. కొన్ని కమర్షియల్ సినిమాలు చేసిన తర్వాత అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. అప్పుడు అమ్మ మీద కోపంతో ఆ తర్వాత కొన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత పూర్తిగా పెళ్లి గురించి ఆలోచించడం మానేశాను. పెళ్లి చేసుకుంటే నా ప్రైవసీ పోతుంది. ఏం చేయాలన్నా భర్త్ దగ్గర అనుమతి తీసుకోవాలి.
ఒక దశలో నా బాయ్ ఫ్రెండ్సే నన్ను కట్టడిచేయడం స్టార్ట్ చేశారు. ఇక పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని ఆంక్షలు పెడతారోనని చేసుకోలేదు. తన లైఫ్ లో 7-8 మందిని ఇష్టపడ్డానని, కానీ వాళ్లను పెళ్లి చేసుకోకూడని నిర్ణయించుకొన్నా. ఇప్పటికి ఆ 8 మంది తన కుటుంబాలతో పాటు తన ఇంటికి వస్తుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. షకీలకి సిగరేట్ వ్యసనం ఉందట. షకీలకి బాలీవుడ్ నటి పూజా భట్ సిగరేట్ తాగడం నేర్పిందట. దాదాపు 30 ఏళ్లుగా సిగరెట్ తాగుతూనే ఉన్నా. మానెయ్యలేకపోతున్నానని షకీల తెలిపింది.