సిగ్గుచేటు : ఆర్టీసీ సమ్మెపై కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధి ఇదీ.. !

తెలంగాణలో ఆర్టీసీ సమ్మైపై ప్రతిపక్ష పార్టీలు పట్టుదలతో పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఐతే, ఆ పట్టుదల వెనక కేవలం నటన మాత్రమే ఉంది. పొలిటికల్ పబ్బం గడుపుకొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆర్టీసీ సమ్మెని సీరియస్ గా తీసుకొన్నట్టుంది. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికులని తప్పుదోవ పట్టిస్తున్నారు.. అనడానికి ఫర్ ఫెక్ట్ ఉదాహరణ ఒకటి దొరికింది.

ఆర్టీసీ సమ్మె విషయంలో తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసగా సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, నేతలని ముందస్తు అరెస్టులు, గృహనిర్భంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. చాలామంది నేతలని ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఐతే, రేవంత్ రెడ్డిలాంటి వాళ్లు ఒకరిద్దరు పోలీసుల కన్నుగప్పి షో చేసేందుకు ప్రయత్నించారు. కాగా, మాజీ కేంద్రమంత్రి సత్యనారాయణ చేసిన షో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఆయన అపార్ట్ నుంచి కూడా కాలు బయటపెట్టకుండా ప్రగతి భవన్ ని ముట్టించినంత బిల్డప్ ఇచ్చారు. తనని పోలీసులు బలవంతంగా ఆపుతున్నట్టు చిన్ని వీడియో షూట్ ని పోజులిచ్చి.. బాగా వచ్చిందా ? అన్నట్టు నవ్వేసి ఊరుకొన్నారు. ఈ వీడియో చూసినోళ్లంతా..  ఇది ఆర్టీసీ సమ్మెపై పట్ల కాంగ్రెస్ నేతలకి ఉన్న చిత్తశుద్ది అని విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నేతలే సర్వేను పార్టీ నుంచి సంస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు. అన్నట్టు సర్వే.. తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి లిస్టులో ఉన్నడు మరీ.. !