ఇకపై సామాన్యులకి బ్రేక్ దర్శనం. కానీ.. !
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకొంది. ఇన్నాళ్లు రాజకీయ నాయకులు, సెలబ్రేటీలకే పరితమైన బ్రేక్ దర్శనాన్ని సామాన్యులకి అందజేయాలనే నిర్ణయం తీసుకొంది. కానీ, ఇందుకోసం కొన్ని నిబంధనలు పెట్టింది. అదేటంటే ? వీఐపీ బ్రేక్ దర్శనం కావాలనుకునే భక్తులు రూ.10 వేలు డొనేట్ చేయాల్సి ఉంటుంది. రూ. 10వేల విరాళంతో పాటు రూ.500 టికెట్ కూడా కొనాల్సి ఉంటుంది. విరాళాలు ఇచ్చిన భక్తులకు ప్రొటోకాల్ పరిధిలోకి తెచ్చి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించనున్నారు.
ఈ విరాళాల కోసం గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ సేవలను ఆన్లైన్లో కూడా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నవంబరు తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన యాప్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సామాన్యులకి బ్రేక్ దర్శనం ఆలోచన చాలా మంచిదే. కానీ, రూ. 10000 డొనేట్ చేయగల సామన్య భక్తులు ఎంత మంది ఉంటారు ? అన్నదే ప్రశ్న.