దిల్ రాజుకి పొలిటికల్ ఆఫర్ ?

సినీ ప్రముఖులకి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకు టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజుకి ఒక్కరికే ఆహ్వానం లభించడం హాట్ టాపిక్ గా మారింది. ఐతే, దీని వెనక పొలిటికల్ రిజీన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కేంద్ర మంత్రి దిల్ రాజుని కలిశారని, ఆయన్ని బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని సమాచారమ్. దిల్ రాజు కూడా సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ప్రధాని విందుకు ఆహ్వానం లభించడం.. ప్రధానితో దిగిన ఫోటోని దిల్ రాజు ఆనందంతో అభిమానులతో పంచుకోవడం జరిగినట్టు చెప్పుకొంటున్నారు. ఇందులో నిజమెంత ? అనేది కాలమే చెప్పాలి మరీ.. !

ఇక దిల్ రాజు వివాదాలకు దూరంగా ఉంటారు. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల కుటుంబాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు టాలీవుడ్‌కు సంబంధించిన ఏదైనా సమస్య లేదా వివాదం వచ్చినప్పుడు కూర్చొని దాన్ని సద్దుబాటు చేసే పెద్ద తలకాయల్లో ఈయన ఒకరు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రల్లో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ దిల్ రాజుని పార్టీలో చేర్చుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి దిల్ రాజుకి పొలిటికల్ ఆఫర్ అయితే వచ్చింది. దాన్ని దిల్ రాజు ఓకే చేస్తారా ? చేస్తే ఎప్పుడు ? అనేది తెలియాల్సి ఉన్నాయి.