రాజమౌళి అంత కచ్చితంగా ఉంటారా ?

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? ఈ ట్విస్టుని రిలీవ్ కావడానికి దాదాపు రెండేళ్ల పట్టింది. అప్పటి వరకు ఆ ట్విస్ట్ రిలీవ్ కాకుండా రాజమౌళి జాగ్రత్తపడటం గొప్ప విశేషం.  ఈరోజులు ఎంత పెద్ద సినిమా అయినా.. ఫస్ట్ షో పడిన గంటలోపే ఆన్ లైన్ లీకవ్వడం చూస్తున్నాం. అలాంటిది బాహుబలిని లీకులకి దూరంగా ఉంచడంలో జక్కన్న విజయం సాధించారని చెప్పాలి. ‘బాహుబలి’ చిత్రం 10జులై 2015న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటి నుంచి 28 ఏప్రిల్ 2017 వరకు కప్పప్ప బాహుబలిని ఎందుకు చంపారు ? అనే విషయం లీక్ కాలేదు. బాహుబలి నటీనటీలు ఏ ఒక్కరు బాహుబలి ట్విస్ట్ ని లీక్ చేయలేదు.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలోనూ రాజమౌళి అంతే కచ్చితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ మూడు పాటలు రాయాల్సి ఉందట. ఓ రచయితతో పాటలు రాయించుకోవాలంటే దర్శకుడు కథ లేదా ఆ సందర్భం గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వాల్సిందే. అలా మూడు పాటలు రాస్తున్న రచయితకి చాలా విశ్లేషణ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రాజమౌళి..’ఈ మూడు పాటలలోని కనీసం ఒక చరణం, కానీ పల్లవి కానీ మీ భార్యతో కూడా చెప్పకూడని నిభందన పెట్టారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అశోక్ తేజ్ చెప్పారు. దీన్ని బట్టి సినిమాల విషయంలో జక్కన్న ఎంత కచ్చితంగా ఉంటారన్న విషయం అర్థం చేసుకోవచ్చు.