ఆయన కారు నెం. ‘AP CM Jagan’
ఆయన కారు నెం. ‘AP CM Jagan’. అలాగని అది ఏపీ సీఎం జగన్ కారు కాదు. ఆయన అసలు రాజకీయ నేత కానేకాదు. ఓ సామాన్యుడు. పోలీసుల తనిఖీలు, టోల్ రుసుం మినహాయింపు చాలా తెలివిగా సీఎం జగన్ పేరునే తన కారు నెంబర్ ప్లేట్ గా తగిలించుకొన్నాడు. అతడి పేరు ముప్పిడి హరి రాకేష్. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వాసి.
ఈనెల 19న జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన సమయంలో అటుగా వచ్చిన కారు ఇది. దీంతో ఆపిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు నంబర్ ప్లేట్ కు బదులు AP CM Jagan అని రాసి ఉంది. గట్టిగా అడిగేసరికి పోలీసుల తనిఖీలు, టోల్ రుసుం మినహాయింపు కోసం ఇలా చేసినట్లు కారు యజమాని ముప్పిడి హరి రాకేశ్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడీ కారు నెంబర్ ప్లేట్, ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.