ఇండియన్ సినిమా ‘బాహుబలికి జన్మదిన శుభాకాంక్షలు’ !

మనందరి డార్లింగ్, ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు డార్లింగ్ ని విష్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో రెండు రోజుల ముందుగానే ప్రభాస్ పుట్టినరోజు పండగ మొదలై పోయింది. డార్లింగ్ బర్త్ డే పోస్టులు, ట్విట్ లతో సోషల్ మీడియా కలర్ ఫుల్ గా మారిపోయింది. మరిన్ని మంచి సినిమాలు చేయాలని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని కోరుకుంటూ.. డార్లింగ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

ఇక ప్రభాస్ సినీ కెరీర్ పై ఓ లుక్కేస్తే.. ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఎంట్రీతోనే మాస్ పాత్రలో అదరగొట్టేశాడు. ఆ తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ పెద్దగా ఆడలేదు. ‘వర్షం’తో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు. ఆ తర్వాత ‘అడవి రాముడు’ చేసిన ప్రభాస్ ‘చక్రం’ లాంటి ప్రయోగత్మక చిత్రంలో నటించి ప్రశంసలు అందుకొన్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రప్రతి’తో ప్రభాస్ నట విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత చేసిన పౌర్ణమి, యోగి సినిమాలు కమర్షియల్ గా ఆడలేదు. ఇక ‘బుజ్జిగాడు’లో సరికొత్త ప్రభాస్ ని ఆవిష్కరించాడు పూరి జగన్నాథ్.

‘బిల్లా’ సినిమాలో స్టయిలీష్ గా కనిపించారు. మరోసారి దర్శకుడు పూరితో చేసిన ‘ఏక్ నిరంజన్’ పెద్దగా ఆడలేదు. డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ‘రెబల్’ లో యాక్షన్ హైలైట్ గా నిలిచినా అందరినీ మెప్పించలేకపోయింది. ఇక ‘మిర్చి’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో రెండు షెడ్స్ ఉన్న పాత్రలో డార్లింగ్ అదరగొట్టేశాడు. బాలీవుడ్ లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘యాక్షన్ జాక్సన్’లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు.

ఇక ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు. ఇండియా సినిమా బాహుబలిగా మారాడు. బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులని అలరించింది. భారతదేశం గర్వించదగ్గ సినిమాగా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా నిలిచింది మన బాహుబలి. ఐతే, ప్రభాస్ ని ఇంటర్నేషన్ స్టార్ చేయడం వెనక ఓ శిల్పి ఉన్నాడు. అతడే జక్కన్న రాజమౌళి. ఆయన లేనిదే బాహుబలి లేదు. ప్రభాస్ ని ఇంటర్నేషనల్ స్టార్ చేసిన రాజమౌళికి ప్రభాస్ ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ మిక్సిడ్ టాక్ వచ్చినా.. మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా (జాన్ – వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఇది క్షుప్తంగా డార్లింగ్ సినీ ప్రస్థానం.

ఇక ప్రభాస్ విషయంలో అభిమానులకి తీరనివి రెండే రెండు కోరికలు. ఒకటి ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని, బుల్లి బాహుబలి ఇవ్వాలని కోరుకొంటున్నారు. ఆ పెళ్లి స్వీటీ అనుష్కతో అయితే.. ఇంకా హ్యాపీ. ఇక రెండోది యేడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయలని ఆశిస్తున్నారు. ఈ రెండు కోరికలు తీర్చలేనివి అయితే కాదు. మరీ.. ఫ్యాన్స్ కోరిక మేరకు డార్లింగ్ త్వరలోనే ఓ ఇంటివాడు అవుతాడేమో చూడాలి. ఇక డార్లింగ్ ప్రభాస్ కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ట్విట్ ని రీ ట్విట్ చేస్తే.. ఇదే మీరు నాకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్. ఇట్లు.. డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్.