ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ ?

బాహుబలి ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఇటీవ‌ల ప్ర‌భాస్ లండ‌న్ వెళ్లాడు. అక్క‌డే ప్ర‌భాస్ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుగుతాయ‌నుకున్నారంతా. కానీ.. ప్ర‌భాస్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశాడు. దాంతో ప్రభాస్ బర్త్ డే వేడుకలు ఎక్కడ ? అంటూ చాలా మంది అడుగుతున్నారు. ఐతే, బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఏమీ లేవు. త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, అతి ముఖ్యులతో మాత్ర‌మే ప్ర‌భాస్ గ‌డ‌ప‌బోతున్నాడు. బుధ‌వారం సాయింత్రం ప్ర‌భాస్ త‌న స్నేహితుల‌కు ఓ పార్టీ ఇచ్చే ఏర్పాట్ల‌లో ఉన్నాడు. 

అంతేకాదు.. పుట్టినరోజు కానుకగా అభిమానులకి ప్రభాస్ ప్రత్యేక బహుమతులు ఏమీ ఇవ్వడం లేదు. రాథాకృష్ణం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ లాంటిది విడుదల చేస్తారని అనుకొన్నారు. కానీ, అలాంటిదేమీ లేదు. ఈ సినిమా కోసం జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇప్పుడీ టైటిల్ ని మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక‌మైన సెట్ కూడా రూపొందించారు. కొద్ది రోజుల విరామం త‌ర‌వాత రాధా కృష్ణ సినిమా షూటింగ్ మొద‌లైపోతుంది. ప్రభాస్ షూటింగ్ తో బిజీ కానున్నారు.