తారక్, చరణ్’లకి  నెలకో రూ.10లక్షల బోనస్ ! 

ఆర్ఆర్ఆర్’ సినిమాకి గానూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నెలకో రూ.10 లక్షల బోనస్ తీసుకొంటున్నారట. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదో భారీ బడ్జెట్ చిత్రం. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తారక్, చరణ్ లు ఎంత తీసుకొంటున్నారు ? అంటే చెరో పాతిక లక్షల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదీకాకుండా నెలకో చెరో రూ. 10లక్షలు తీసుకుంటున్నారని తెలిసింది.

ఆర్ ఆర్ ఆర్ కోసం వందల కోట్లు ఖర్చుచేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలం ఈ సినిమా కోసం ఎన్టీఆర్-రామ్ చరణ్ టైమ్ కేటాయించారు. వారికి ఇచ్చే రెమ్యూనిరేషన్ కి అదనంగా నెలకు చెరో పది లక్షల వంతున షూటింగ్ ఖర్చులకోసం కేటాయించినట్లు తెలుస్తోంది. అంటే రెండేళ్ల పాటు షూటింగ్ జరిగితే ఇద్దరు హీరోలకు చెరో 2.40 కోట్ల రూపాయలు బోనస్ ముట్టనుంది.

ఇక రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సినిమాకు పారితోషికం పారితోషికం లేదు. ఆయన లాభాల్లో సగం వాటా తీసుకొంటారు. రాజమౌళి వాటాలోనే ఆయన ఫ్యామిలీ మెంబర్లు అందిరకీ రెమ్యూనిరేషన్ లు వుంటాయని తెలుస్తోంది. ఈ లెక్కన జక్కన్న రెమ్యూనరేషన్ వందకోట్లలో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ? బాహుబలి ఏ రేంజ్ లో లాభాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. అదే రిపీట్ అయితే.. జక్కన్న ఖాతాలో వందల కోట్లు చేరినట్టే.